Bellampally: సీఎం రేవంత్‌ను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్!
Bellampally: మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు.
Bellampally: సీఎం రేవంత్‌ను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్!
Bellampally: సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ.గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలను ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్య, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పట్టణాభివృద్ధి తదితర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు.
అలాగే బెల్లంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి, నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కోరారు. ఇప్పటికే ప్రతిపాదించిన, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
బెల్లంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్యమంత్రి కి వివరించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తూ, బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కృషి చేస్తానని తెలిపారు.




