Bhainsa: భైంసాలో బీఆర్‌ఎస్ నిరసన 100 మీటర్ల ఫ్లెక్సీతో భారీ శోభాయాత్ర!

Bhainsa: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని నిర్మల్ జిల్లా భైంసాలో బీఆర్‌ఎస్ నాయకుల నిరసన. 100 మీటర్ల ఫ్లెక్సీతో శోభాయాత్ర, బాకీ కార్డుల పంపిణీ.

Srinivas, Mondol Bhainsa
Updated on: 2 Sept 2026 1:18 PM IST
Bhainsa
X

Bhainsa: భైంసాలో బీఆర్‌ఎస్ నిరసన 100 మీటర్ల ఫ్లెక్సీతో భారీ శోభాయాత్ర!

Bhainsa: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ముధోల్ బీఆర్‌ఎస్ సమన్వయ నాయకులు విలాస్ గాదేవర్, పడకంటి రమాదేవి, డాక్టర్ కిరణ్ కొమురెవార్, లోలం శ్యాంసుందర్ ఆరోపించారు.వారి ఆధ్వర్యంలో బుధవారం భైంసా పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా గాంధీ, అంబేద్కర్, అన్నాభావు సాఠే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పట్టణంలోని మార్కెట్ వీధుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలను ప్రదర్శిస్తూ 100 మీటర్ల ఫ్లెక్సీతో శోభాయాత్ర నిర్వహించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ‘కాంగ్రెస్ బాకీ కార్డులను’ ప్రజలకు పంపిణీ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడిచినా 420 హామీల్లో అనేక హామీలను అమలు చేయలేదని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, బీడీ కార్మికులకు రూ.4 వేల పెన్షన్, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాలూక వ్యాప్త బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa

Next Story