Bhainsa: బైంసాలో వైభవంగా గట్టు మైసమ్మ బోనాలు!

Bhainsa: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో కులమతాలకు అతీతంగా గట్టు మైసమ్మ బోనాల పండుగ. అమ్మవారిని దర్శించుకుని బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే రామారావు పటేల్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 19 July 2026 12:42 PM IST
Bhainsa
X

Bhainsa: బైంసాలో వైభవంగా గట్టు మైసమ్మ బోనాలు!

Bhainsa: నిర్మల్ జిల్లా బైంసా పట్టణం లో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఆషాడ మాసం లో ఈ బోనాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. కులమతాలకు అతీతంగా బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయం అంగరంగ వైభవంగా బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి ధూపదీప నైవేద్యాలతో భాజా భజంత్రీలతో ప్రత్యేక పూజలను చేశారు.

బోనాల పండుగలు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మో ళ్ల దత్తాత్రి పాల్గొని బోనం ఎత్తుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పడాలని అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు. ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నాయి రైతులు ఆరుతడి పంటలను వేయాలని కోరారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story