Nirmal: హైదరాబాద్‌లో స్వర్ణకార శంఖారావం.. భైంసా నుంచి తరలివెళ్లిన నేతలు!

Nirmal: హైదరాబాద్‌లో జరిగే 'స్వర్ణకార శంఖారావం' కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ నుంచి బయలుదేరిన స్వర్ణకార సంఘం నాయకులు.

Srinivas, Mondol Bhainsa
Published on: 24 Oct 2026 1:36 PM IST
Nirmal
X

Nirmal: హైదరాబాద్‌లో స్వర్ణకార శంఖారావం.. భైంసా నుంచి తరలివెళ్లిన నేతలు!

Nirmal: హైదరాబాద్‌లో శనివారం నిర్వహించే స్వర్ణకార శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ స్థానిక స్వర్ణకార సంఘం నాయకులు హైదరాబాద్ కు బయలుదేరారు.

స్వర్ణకారుల సమస్యల పరిష్కారం, జీఓ ఎంఎస్‌ నం.272 అమలు, 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకారులకు పింఛన్లు, సంక్షేమ పథకాల అమలు తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. స్వర్ణకారులందరూ ఐక్యంగా తమ హక్కుల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa