Gudihathnoor: గుడిహత్నూర్‌లో ఘనంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి!

Gudihathnoor: గుడిహత్నూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ హాజరయ్యారు.

NAGULA SATISH, BOATH
Published on: 6 July 2026 2:41 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: గుడిహత్నూర్‌లో ఘనంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి!

​గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని శివ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ సమైక్యత, సమగ్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప జాతీయవాది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగాలు ప్రతి భారతీయుడికి ఆదర్శమని, కార్యకర్తలందరూ ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి దేశాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కేంద్రే శివాజీ, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శులు చాటే సంబాజీ, జగన్, మాజీ ప్రజాప్రతినిధులు భరత్, జాలీం, రమేష్ జాదవ్, జిల్లా, మండల మోర్చా నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story