Boath: ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనంపై బోథ్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకుల ఫిర్యాదు
Boath: బోథ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు.
Boath: ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనంపై బోథ్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకుల ఫిర్యాదు
బోథ్: బోథ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం మాట్లాడుతూ దేశ ప్రధాని దిష్టిబొమ్మ తగలబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పతంగి బ్రహ్మానందం మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్న నరేంద్ర మోడీని కించపరిచే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. చేతనైతే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పెట్రోల్ ధరలను మన రాష్ట్ర ధరలతో పోల్చి చూసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ముడిచమురుపై దేశంలో ఎక్కడ లేని పన్నును తెలంగాణ రాష్ట్రం వసూలు చేస్తుందని అన్నారు, ఇంకొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే జిల్లాలోని ప్రతి మండలంలో కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని ఈ సందర్భంగా బ్రహ్మానంద్ హెచ్చరించారు. కార్యక్రమం లో పార్టీ నాయకులు పాల్గొనారు.




