Nirmal: కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మంత్రుల దోపిడీ: బీజేపీ ఎమ్మెల్యే!

Nirmal: తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆధారాలతో ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 14 Aug 2026 8:15 PM IST
Nirmal
X

Nirmal: కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మంత్రుల దోపిడీ: బీజేపీ ఎమ్మెల్యే!

నిర్మల్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే నలుగురు మంత్రులు అందిన కాడికి దోచుకుంటూ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని బిజెపి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ రూరల్ మండలంలోని తల్వేదలో గల బిజెపి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు వేలకోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ముఖ్యమంత్రి భయపడుతున్నారని, ఎన్నికల్లో గెలవలేమని రేవంత్ రెడ్డికి అర్థమైందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, దొరికినంత దోచుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీలో లక్ష రూపాయల కాపిటల్ కూడా లేనప్పటికీ కంపెనీకి వేల కోట్ల ఆస్తులు బదలాయించారని పేర్కొన్నారు.

ఈ కంపెనీకి నీ శాఖ నుండే బదులాయింపులు జరిగాయి కదా ఎందుకు సమాధానం చెప్పడం లేదని మంత్రి శ్రీధర్ బాబుని ప్రశ్నించారు. హాట్ ప్రివెన్షన్ స్పీచ్ యాక్ట్ బిల్లు తీసుకువచ్చి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారని, బిజెపి ఎప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుందన్నారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి 15 వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలను బయట పెట్టడం కాకుండా దీనిపై భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.

రాబోయే రోజుల్లో బిజెపి కార్యాచరణ రూపొందించి ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. ఇడికి ఆధారాలతో కంప్లైంట్ చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీతో ఉన్న సంబంధాన్ని సైతం బయట పెడతామన్నారు. ఆంధ్ర నాయకుల చేతుల్లోనే రాష్ట్రం నడుస్తోందని రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చూస్తుంటే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల కన్నా, రాష్ట్ర అభివృద్ధి కన్నా అవినీతి మీదే ఎక్కువ ధ్యాస ఉందని ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఈ నాలుగు మంత్రులపై క్యాబినెట్ సమావేశంలో మిగతా మంత్రులు నిలదీయాలని సూచించారు. ప్రభుత్వం రైతు బీమా ఇన్సూరెన్స్ లు కట్టక భీమాను ఆపివేయడం జరిగిందని, ఇన్సూరెన్స్ డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేసి ప్రజా సమస్యలను, ప్రజాధనాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story