Adilabad: ఆదిలాబాద్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం ముట్టడి!
Adilabad: ఎస్సీ సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆదిలాబాద్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు.
Adilabad: ఆదిలాబాద్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం ముట్టడి!
Adilabad: రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేవన్న ఆరోపించారు. చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆదిలాబాద్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం ఎదుట ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ముట్టడి చేపట్టారు. ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులను విడుదల చేయాలని, ఆ నిధులను దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ఘటిక క్రాంతి కుమార్, శైలేందర్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.




