Nirmal: నిర్మల్‌లో జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థుల రాస్తారోకో!

Nirmal: నిర్మల్‌లో జీవో 97కు వ్యతిరేకంగా బీజేవైఎం, పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో. సీఎం దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం, పోలీసులతో వాగ్వాదం.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 22 Aug 2026 1:03 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థుల రాస్తారోకో!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గంట నుంచి రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జీవో నెంబర్ 97ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యపై ఆధారపడి విద్యలభ్యసిస్తుంటే 97 జీవో వల్ల విద్యార్థులకు ఫీజులు పెరిగే అవకాశం ఉందని, తర్వాత తదుపరి ఉన్నత చదువులకు అవకాశాలు తగ్గిపోతాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అసౌకర్యం కలిగించే జీవోను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story