Adilabad: ఆదిలాబాద్ కలెక్టర్ వద్ద BJYM ఆందోళన సీఎం దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం
Adilabad: ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తా వద్ద బీజేవైఎం ధర్నా. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లు తక్షణమే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ డిమాండ్.
Adilabad: ఆదిలాబాద్ కలెక్టర్ వద్ద BJYM ఆందోళన సీఎం దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం
Adilabad: పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తా వద్ద ఆందోళన స్వల్ప ఉద్రిక్తత చోట చేసుకుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో నేతలు మరియు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం దిష్టిబొమ్మను పోలీసులు లాక్కొని తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ రాష్ట్రంలో విద్యార్ధుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




