Mancherial: రక్తదానం.. ప్రాణదానం: ముందుకు రావాలి యువత

Mancherial: జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Updated on: 1 Oct 2026 2:47 PM IST
Mancherial
X

Mancherial: రక్తదానం.. ప్రాణదానం: ముందుకు రావాలి యువత

Mancherial: మంచిర్యాల అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని లయన్ డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి అన్నారు. జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాలలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) బ్లడ్ బ్యాంక్ సెంటర్‌లో రక్తదాన శిబిరం, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా DMHO డా. నరేందర్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-G సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచేందుకు తొలుత ఆయనే స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా డా. చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ.. రక్తదానం ఒక గొప్ప సామాజిక సేవ అని అన్నారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. “రక్తదానం – ప్రాణదానం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

ఈ సందర్భంగా రక్తదానం చేసిన వాగ్దేవి డిగ్రీ కళాశాల వాలంటీర్లు, కరస్పాండెంట్ మల్లయ్య, వివేకవర్ధిని డిగ్రీ, పీజీ కళాశాల వాలంటీర్లు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమ సమన్వయకర్తగా లయన్ మధుసూదన్ రెడ్డి వ్యవహరించారు. IRCS కార్యదర్శి చందూరి మహేందర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు చుంచు శంకర్ వర్మ, శ్రీనివాస్, సంతోష్, ఎడ్ల కిషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పాస్ట్ ప్రెసిడెంట్ కారుకూరి చంద్రమౌళి, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి అధ్యక్షుడు మోహన్ కృష్ణ, కార్యదర్శి రాజేష్, కోశాధికారి సమీర్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

“రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి. మీ రక్తం మరొకరి జీవితానికి వెలుగవుతుంది” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.