Boath: అంగన్‌వాడీ టీచర్లపై పనిభారం.. ఓటరు సవరణ ప్రక్రియ శరవేగం

Boath: బోథ్, ఇచ్చోడల్లో అంగన్‌వాడీలకు ఓటరు సవరణ పనిభారం. కేంద్రాల వేళలు మారుస్తూ డైరెక్టర్ శృతి ఓజా ఉత్తర్వులు. గుడిహత్నూర్‌లో 85 శాతం పూర్తి.

NAGULA SATISH, BOATH
Published on: 1 July 2026 3:42 PM IST
Boath
X

Boath: అంగన్‌వాడీ టీచర్లపై పనిభారం.. ఓటరు సవరణ ప్రక్రియ శరవేగం

బోథ్: ఒకే విడతలో అటు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, ఇటు ఎన్నికల ఓటరు సవరణ విధులు (SIR) నిర్వర్తించాల్సి రావడంతో అంగన్‌వాడీ టీచర్లు తీవ్ర పనిభారంతో అల్లాడిపోతున్నారు. బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితా సవరణ ఫారాలను పూర్తి చేయడం వారికి కత్తిమీద సాములా మారింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నిత్యం సేవలు అందిస్తూనే, మరోవైపు ఎండనక వాననక కాలనీల్లో తిరుగుతూ బీఎల్ఓలుగా అదనపు బాధ్యతలు మోయాల్సి రావడంపై అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అంగన్‌వాడీల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనంగా జూన్ 29 నుంచి జూలై 28 వరకు నెల రోజుల పాటు కేంద్రాల వేళలను ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు మారుస్తూ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా ఉత్తర్వులు జారీ చేశారు.

​ఈ ఇబ్బందుల నడుమ కూడా బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గుడిహత్నూర్ మండల వ్యాప్తంగా మొత్తం 36 మంది బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్నారని తహసిల్దార్ కవితారెడ్డి తెలిపారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ, బీఎల్ఓల చొరవతో మండలంలో ఇప్పటివరకు 85 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని ఆమె పేర్కొన్నారు. మిగిలిన ప్రక్రియను కూడా గడువులోగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేస్తున్నామన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story