Boath: బీఆర్‌ఎస్ భారీ నిరసన 420 అడుగుల ఫ్లెక్సీతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ధర్నా!
Boath: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో బీఆర్‌ఎస్ భారీ ధర్నా. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బాకీ కార్డుల పంపిణీ.
Boath: బీఆర్‌ఎస్ భారీ నిరసన 420 అడుగుల ఫ్లెక్సీతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ధర్నా!
Boath: వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ పోరుబాటకు దిగింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టడంతో పాటు 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టారు గులాబీ శ్రేణులు.
కాంగ్రెస్ హామీల బాకీ కార్డుతో బి.ఆర్.ఎస్ నేతలు సెల్ఫీలు దిగి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బోథ్ నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. తెలంగాణలో లంకె బిందెలు లేకపోవచ్చు కానీ తెలంగాణ దేశానికే అక్షయ పాత్ర అన్నారు.
ఎమ్మెల్యే అనీల్ జాదవ్.కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పోరాటం కొనసాగుతుందన్నారు.
ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, అప్పటి వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉంటుందని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్.




