Mancherial: మంచిర్యాలలో బీఆర్ఎస్ భారీ రైతు సదస్సు.. కాంగ్రెస్ పాలనపై మండిపడ్డ జీవన్ రెడ్డి, బాల్క సుమన్
Mancherial: మంచిర్యాల జిల్లా జైపూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రైతు సదస్సు.
Mancherial: మంచిర్యాలలో బీఆర్ఎస్ భారీ రైతు సదస్సు.. కాంగ్రెస్ పాలనపై మండిపడ్డ జీవన్ రెడ్డి, బాల్క సుమన్
మంచిర్యాల జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న వేళ వ్యవసాయ విధ్వంసం పేరుతో బీఆర్ఎస్ పార్టీ భారీ రైతు సదస్సును నిర్వహించింది. జైపూర్ మండల కేంద్రంలోని లోని SLNR ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ సదస్సుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విత్తనాలు ఎరువుల నుంచి మొదలుకొని మద్దతు ధర వరకు ప్రతి విషయంలోనూ రైతులను దగా చేశారని నేతలు ఆరోపించారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో వ్యవసాయ రంగం ఎంతగా దెబ్బతిందో వివరించేందుకు బీఆర్ఎస్ ఈ రైతు సదస్సును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, స్థానిక రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అరాచకాలపై మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
బాల్క సుమన్ కామెంట్స్...!
చెన్నూరు నియోజకవర్గం లో మంత్రి వివేక్ PA రమణ రావు ఇసుక క్వారీ లో అక్రమ వసూళ్లు చేస్తున్నాడు. 1000 రోజుల కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి ఏమీ లేదు, మొత్తం అరాచకం, దోపిడి, గుండా గిరి చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన లో రైతులకు రైతు భరోసా, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు కరువయ్యాయి. కెసిఆర్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంది. చెన్నూరు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు నీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కామెంట్స్...!
రైతు లు పండించిన పంటలను రైస్ మిల్లు ల్లో తరుగు పేరిట రైతులను ముంచుతున్న పట్టించుకోవడం లేదు. మంత్రి వివేక్ విదేశాల పర్యటన చేస్తున్నారు తప్ప నియోజకవర్గం లోని ప్రజలను పట్టించుకోవడం లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంపు హౌస్ నుండి వ్యవసాయానికి నీరు ఎత్తి పోయామంటే మాయ మాటలు చెప్పి రైతులకు ద్రోహం చేశారు. రాష్ట్రంలో రైతులకు రైతు బందు రైతు భరోసా, సకాలంలో ఎరువులు, విత్తనాలు దొరకక ఇబ్బంది పడుతున్నడు. మంత్రి వివేక్ చెన్నూర్ యువత కు 40,000 ఉద్యోగాలు ఇప్పిస్తాను అని ఇప్పుడు జర్మనీ జపాన్ బాషాలు నేర్చుకోండి అంటున్నాడు.




