Adilabad: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట!
Adilabad: కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్ పోరుబాట. సీసీఐ పునరుద్ధరణ, ఎన్నికల హామీలపై మాజీ మంత్రి జోగు రామన్న తీవ్ర విమర్శలు.
Adilabad: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట!
Adilabad: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల విఫల పాలన పేరుతో ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా సీసీఐ పునర్ధరణపై నిరసన సదస్సు నిర్వహించారు.
మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ పార్టీ సంబరాలు జరుపుకోవాలని అంటే రాష్ట్ర ప్రజలను మరింత మోసం చేయడమే అని అన్నారు. ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు.
వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసిఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని విస్మరిస్తున్నదని ఆరోపించారు. సీసీఐ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.




