Adilabad: ఆగస్టు 31 తర్వాత ఆమరణ దీక్ష.. జోగురామన్న సంచలన ప్రకటన!
Adilabad: ఆగస్టు 31లోగా బీజేపీ నేతలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మాజీ మంత్రి జోగురామన్న హెచ్చరించారు.
Adilabad: ఆగస్టు 31 తర్వాత ఆమరణ దీక్ష.. జోగురామన్న సంచలన ప్రకటన!
ఆదిలాబాద్ జిల్లా: మాజీమంత్రి జోగురామన్న ప్రెస్మీట్,సిసిఐని పునప్రారంభిస్తామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు,కేటీఆర్ పై మాట్లాడే స్థాయి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ది కాదు, ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం.2022 నుండి సిసిఐ సాధన సమితి సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం అనేక ఉద్యమాలు జరిగాయి ,సిసిఐ తెరిపిస్తామని ఏళ్ల తరబడి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు బహిరంగంగా హామీలు ఇచ్చారు.
బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిసిఐ రీఓపెన్ కోసం అనేక ప్రయత్నాలు చేసాం,సిసిఐ కోసం మేము కొత్తగా పోరాటం చేయడం లేదు, నాటి నుండి సిసిఐ పునరుద్ధరణ కోసం బి.ఆర్.ఎస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తరహాలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో సిసిఐని ప్రారంభిద్దామని నాటి సీఎం కోరారు.
డూప్లికేట్ ఎంపీ, ఎమ్మెల్యే ఆదిలాబాద్ కి దరింద్రాలాగా మారిపోయారు,ఊసరవెల్లిలా మాటలు మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు ఆదిలాబాద్ ప్రజలు ఓట్లు వేసి ఎంపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే, ఓ ములనా కూర్చోవడం దురదృష్టకరం,ప్రతి విషయంలో కిషన్ రెడ్డి-రేవంత్ రెడ్డికి మధ్య ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఢీల్స్ కుదిరిస్తూన్నాడు ,వైజాగ్ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు కోసం ప్రారంభించిన కేంద్రం, ఆదిలాబాద్ సిసిఐని నిరుద్యోగుల కోసం ప్రారంభించలేరా? ఉన్న సిమెంట్ పరిశ్రమను ఉడగొడుతూ.. కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ఎం లాభం.
పాయల్ శంకర్ నువ్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గెలిచావా.. రియల్ ఎస్టేట్ కోసం గెలిచావా,రేవంత్ రెడ్డి బావమర్దికి భూములు కట్టబెట్టే పనిలో పాయల్ శంకర్ బిజీగా ఉన్నారు.సిసిఐ రీఓపెన్ పై క్లారిటీ ఇవ్వని పక్షాన.. సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయి.
ఆగస్టు నెల డెడ్ లైన్ విధిస్తున్నాం, సిసిఐ పునప్రారంభంపై బిజెపి నేతలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి.




