Khanapur: ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకుల నిరసన, ధర్నా

Khanapur: ఖానాపూర్, కడెం, దస్తురాబాద్‌లలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధనం. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని తహసీల్దార్‌కు వినతి.

RAKESH N, KHANAPUR
Published on: 17 Aug 2026 2:13 PM IST
Khanapur
X

Khanapur: ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకుల నిరసన, ధర్నా

Khanapur: ఖానాపూర్, కడెం, దస్తురాబాద్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ అమలు చేసిన కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకాల అమలుపై హై కోర్టు స్టే విధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. నిరుపేద ఆడబిడ్డలను దృష్టిలో ఉంచుకొని గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు మేనమామ కానుకగా కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం పేరుతో రూ.1,00,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు.

ఆ పథకాన్ని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆ పథకానికి పేరు మార్చిన పరవాలేదు కానీ పథకాన్ని పూర్తిస్థాయిలో రద్దు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story