Bellampalli: బెల్లంపల్లిలో కళ్యాణలక్ష్మి కోసం బీఆర్‌ఎస్ నిరసన!
Bellampalli: బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నిరసన. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయాలని డిమాండ్.
Bellampalli: బెల్లంపల్లిలో కళ్యాణలక్ష్మి కోసం బీఆర్‌ఎస్ నిరసన!
Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పేది ఇంటి బిడ్డలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో కాంట చౌరస్తా ఏరియాలో నిరసన.. ఎన్నికల్లో ఇచ్చిన ఆమెని వెంటనే అమలు చేయాలని డిమాండ్.
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ సందర్భంగా మాట్లాడతుతెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కులమతాలకు అతీతంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలబడ్డారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీని నిలబెట్టుకోలేక, భయపడి కోర్టుల ద్వారా ఈ పథకాలనే రద్దు చేసేందుకు కుట్రలు చేస్తోంది.
ఇచ్చిన హామీ ప్రకారం ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వడంతో పాటు రైతు భీమా, రైతు పెట్టుబడి సహాయం, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ వంటి అన్ని సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం దిగివచ్చి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేస్తుందని బెల్లంపల్లిలో నాయకులు స్పష్టం చేశారు.




