Nirmal: ఈనెల 11న నిర్మల్‌లో BRS రైతు గర్జన భూమి పూజ చేసిన మాజీ మంత్రి!

Nirmal: ఈనెల 11న నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బీఆర్ఎస్ రైతు గర్జన సభ. సభాస్థలిలో భూమి పూజ నిర్వహించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 7 Nov 2026 11:07 AM IST
Nirmal
X

Nirmal: ఈనెల 11న నిర్మల్‌లో BRS రైతు గర్జన భూమి పూజ చేసిన మాజీ మంత్రి!

Nirmal: ఈనెల 11వ తేదీన నిర్మల్ లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు గర్జన సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న సభాస్థలికి టిఆర్ఎస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో గోస పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, కరెంటు సరిగా సరఫరా కాకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీంతోనే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు గర్జన పేరుతో సభలను నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు ముందుకెళ్తున్నారన్నారు.

ఈనెల 11వ తేదీన ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే గర్జనకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్క సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జిలు రామ్ కిషన్ రెడ్డి, జాన్సన్ నాయక్, నాయకులు నల్ల వినయ్ రెడ్డి, మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL