Gudihatnoor:ఘోర రోడ్డు ప్రమాదం..లారీ ఢీకొని బీఎస్ఎఫ్ జవాన్ మృతి!
Gudihatnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతగొంది వద్ద లారీ ఢీకొని బీఎస్ఎఫ్ జవాన్ జాదవ్ సాయి దుర్మరణం చెందగా, స్నేహితునికి తీవ్ర గాయాలయ్యాయి.
Gudihatnoor:ఘోర రోడ్డు ప్రమాదం..లారీ ఢీకొని బీఎస్ఎఫ్ జవాన్ మృతి!
Gudihatnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని సీతగొంది వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి మితిమీరిన వేగంతో, అజాగ్రత్తగా వచ్చిన ఓ లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో బీఎస్ఎఫ్ జవాన్ జాదవ్ సాయి ఘటన స్థలంలోనే మృతి చెందాడు, బైక్‌పై ఉన్న ఆయన మిత్రుడు ఓంకార్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చిన సాయి, దీపావళి పండుగ సందర్భంగా బట్టలు కొనుగోలు చేసేందుకు తన స్నేహితుడు ఓంకార్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్‌కు బయలుదేరారు. సీతగొంది పరిసరాల్లో రోడ్డు మరమ్మతులు జరుగుతున్న ప్రాంతం గుండా వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై సాయి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, గాయపడిన ఓంకార్‌ను స్థానికులు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
పండుగ వేళ సంతోషంగా షాపింగ్‌కు బయలుదేరిన యువ జవాన్ రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో జామిడి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న గుడిహత్నూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని రిమ్స్ కి తరలించినట్లు సమాచారం, గాయపడ్డ ఓంకార్ నుం సైతం రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.




