Adilabad: బోథ్‌లో చోరీ కేసు ఛేదన ఇంటి పనివాడే దొంగ, ఇద్దరి అరెస్ట్!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

NAGULA SATISH, BOATH
Published on: 1 Aug 2026 8:27 AM IST
Adilabad
X

Adilabad: బోథ్‌లో చోరీ కేసు ఛేదన ఇంటి పనివాడే దొంగ, ఇద్దరి అరెస్ట్!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.4 కిలోల వెండి, 15 గ్రాముల బంగారం, రూ.2,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు బోథ్ సీఐ డి. గురుస్వామి తెలిపారు.

సోనాల మండలం సూర్యనగర్‌కు చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఈ నెల 26న ఇంటికి తాళం వేసి ఛత్తీస్‌గఢ్ వెళ్లగా, ఇంటి పనివాడైన అర్జున్ ఆడే తన మిత్రుడు రథోడ్ గణేష్‌తో కలిసి చోరీకి పథకం వేశాడు. గణేష్ ఇంట్లోకి దూరి సొత్తును దొంగిలించగా, అర్జున్ బయట కాపలా కాశాడు. బాధితుడి ఫిర్యాదుతో జులై 29న కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకున్నారు.

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో ప్రజలు తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ గురుస్వామి సూచించారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ వి. పురుషోత్తం, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story