Adilabad: పశువులకు మత్తు ఇంజక్షన్.. చోరీకి యత్నం..

Adilabad: పశువుల చోరీ ముఠా కలకలం రేపుతోంది. తాంసి, తలమడుగు మండలాల్లో మూగజీవాలకు అర్ధరాత్రి వేళ మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వరుస దొంగతనాలకు యత్నిస్తున్నారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 17 May 2026 4:20 PM IST
Adilabad
X

Adilabad: పశువులకు మత్తు ఇంజక్షన్.. చోరీకి యత్నం..

అదిలాబాద్: మూగజీవాలకు మత్తుమందు ఇచ్చి చోరీకి యత్నించిన వరుస సంఘటనలు అదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి.. గత వారం రోజుల క్రితం తాంసి మండలం పొన్నారి గ్రామంలో పశువుల పాకలో ఉన్న 12 పశువులకు అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మత్తుమందు ఇచ్చి వాటిని గుట్టు చప్పుడు కాకుండా తరలించే యత్నం చేయగా, పక్కింటి వారు గమనించడంతో దుండగులు పరారయ్యారు.

ఈ ఘటన అంతా సీసీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, తాజాగా నిన్నటి రోజు అర్ధరాత్రి తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో రహదారిపై సంచరిస్తున్న రెండు పశువులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి, ఒక గేదెను దొంగలించి కి వెళ్ళగా, మరో పశువును అక్కడే వదిలేసి వెళ్లారు.. ఇదే సమయంలో గ్రామంలోని ఓ ఇంటి యజమానికి మేలుకువ రావడంతో ఆయన గట్టిగా అరవడంతో నిందితులు అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది... వరుస సంఘటనలు రైతులను ఆందోళన గురిచేస్తుండగా, పోలీసులు పశువుల చోరీ ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story