Mancherial: వందో సంవత్సరంలోకి అడుగుపెట్టిన బామ్మ సావిత్రమ్మ!
Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అరుదైన వేడుక జరిగింది.
Mancherial: వందో సంవత్సరంలోకి అడుగుపెట్టిన బామ్మ సావిత్రమ్మ!
మంచిర్యాల జిల్లా: చెన్నూరు పట్టణంలోని స్థానిక శివాలయంలో వందో సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. చెన్నూరు పట్టణానికి చెందిన శ్రీరాంభట్ల సావిత్రి తన శత వసంతోత్సవాన్ని తన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
చెన్నూరు పట్టణంలోని శివాలయంలో 100వ పుట్టినరోజును పురస్కరించుకొని పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. 100వ పుట్టినరోజు జరుపుకుంటున్న సావిత్రమ్మకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు మనవరాలు ముని మనవళ్లు ముని మనవరాలు మొత్తం నాలుగు తరాల తన కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఘనంగా ఆనందోస్తాహల మధ్య 100వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
తన కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్లు, మనవళ్ళు, మనవరాలు నిర్వహించిన ఈ 100వ పుట్టినరోజు వేడుకలను చూసిన ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న భామ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ముందుగా శాస్త్రోత్తంగా శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించి. అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపి, భోజనం కార్యక్రమాలు నిర్వహించారు.99 సంవత్సరాలు పూర్తి చేసుకుని వందో సంవత్సరంలో అడిగిడుతున్న బామ్మ పాదాలకు కుటుంబ సభ్యులు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇంత బిజీ కాలంలో కూడా ఇలా ఘనంగా బామ్మ పుట్టినరోజు వేడుకలను జరపడానికి తన కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్లు, మనవళ్ళు, మనవరాలు, ముని మనవళ్లు, ముని మనవరాలను చూస్తూ ఎంతో సంతోషం తో జన్మదిన వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సావిత్రమ్మ ఆనందం వ్యక్తం చేశారు.వందేళ్లు వచ్చిన ఇప్పటికీ తన పనులు తానే చేసుకోవడం, చక్కగా నడవడం, మాట్లాడడం, చురుకుగా ఉండడం, చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
వృద్ధాప్యం వచ్చిందని కృంగిపోకుండా తనను ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవించాలని పలువురు ప్రశంసిస్తున్నారు.




