Nirmal: చిట్యాలలో ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ!

Nirmal: చిట్యాల గ్రామంలో ప్లాస్టిక్ నివారణకు విద్యార్థుల ర్యాలీ జరిగింది. గ్రామ శుభకార్యాలకు ఉచితంగా స్టీల్ సామాగ్రి ఇస్తామని సర్పంచ్ సుప్రియ ప్రకటించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 11 Aug 2026 1:08 PM IST
Nirmal
X

Nirmal: చిట్యాలలో ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ!

Nirmal: నిర్మల్ రూరల్ మండలంలోని చిట్యాల గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని సమూలంగా నిర్మూలిదామనీ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల గుండా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం పలువురు ప్రముఖులు మాట్లాడుతూ భవిష్యత్తులో ప్లాస్టిక్ భూతం మానవాళికి ఎంతో హాని కలిగిస్తుందన్నారు. కావున అందరూ పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలన్నారు. అంతే కాకుండా ప్లాస్టిక్ ను వాడకాన్ని తగ్గించుకుంటే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దాన్ని నిర్మూలించే విధంగా నేటి నుంచి తమ గ్రామంలో జరిగే అన్ని శుభకార్యాలయాలకు పూర్తిగా స్టీల్ సామాగ్రినీ ఉచితంగా అందిస్తున్నామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఏనుగు సుప్రియ వెంకట్ రెడ్డి అన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story