Nirmal: 'చేయూత' పింఛన్ అందించాలి: నిర్మల్ కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ధర్నా
Nirmal: పిఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ 'చేయూత' పింఛన్ పథకం వర్తింపజేయాలని, ఎన్నికల హామీ ప్రకారం రూ.4,016 పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఏఓకు వినతిపత్రం అందజేశారు.
Nirmal: 'చేయూత' పింఛన్ అందించాలి: నిర్మల్ కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ధర్నా
నిర్మల్: ఆగస్టు 15 నుండి ప్రారంభం కానున్న ఆన్లైన్ దరఖాస్తులలో బీడీ కార్మికులకు కూడా అవకాశం కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ డిమాండ్ చేశారు. ఆన్లైన్ దరఖాస్తులలో బీడీ కార్మికులకు అవకాశం కల్పించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏవోకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు రూ.4,016 పెన్షన్ అమలు చేయాలని, రిటైర్మెంట్ తర్వాత బీడీ కార్మికులకు రూ. 6,000 పెన్షన్ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి నెల 26 రోజులు పని దినాలు కల్పించాలని ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న 'చేయూత' పథకం దరఖాస్తుల స్వీకరణ మార్గదర్శకాలలో బీడీ కార్మికుల ప్రస్తావన లేకపోవడంతో జిల్లాలోని కార్మిక లోకం తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు.
2014 నుంచి నేటి వరకు బీడీ కార్మికులు ఎదురుచూపులు చూస్తున్నప్పటికీ, పాలకుల హామీలు కేవలం నీటి మూటలుగానే మారుతున్నాయన్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొనడం, బీడీ కార్మికులను విస్మరించడం తీవ్ర అన్యాయమన్నారు. నిర్మల్ జిల్లాలో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షన్నరకు పైగా బీడీ కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం జిల్లాలో కేవలం 61,933 మందికి మాత్రమే పింఛన్లు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్ సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని లేనట్లయితే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు క్లేమెంట్ వెస్లీ, రియాoత్, తెలంగాణ బీడీ అండ్ సీగార్ వర్కర్స్ యూనియన్ CITU జిల్లా నాయకులు మల్లీశ్వరి, అనూష, ఆసియా బాన్, పావని సరిన్ ఉమేరా, నాయకులు సయెద్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు.




