Nirmal: ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయండి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం

Nirmal: నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Updated on: 26 May 2026 12:23 PM IST
Nirmal
X

Nirmal: ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయండి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం

నిర్మల్: జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా, నిరంతరాయంగా పూర్తి చేస్తూ ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. లక్ష్మణచాంద మండలంలోని తిర్పల్లి గ్రామంలోని గోదామును ఆయన సందర్శించి వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వెంట వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

గోదాం మొత్తం నిల్వ సామర్థ్యం, ఇప్పటివరకు నిల్వ చేసిన ధాన్యం పరిమాణం, అన్లోడింగ్ కోసం వేచి ఉన్న ట్రాక్టర్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీల సంఖ్యపై ఆరా తీసి అవసరమైతే మరింత మంది హమాలీలను నియమించి అన్లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. హమాలీలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ సరిత, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story