Nirmal: నిర్మల్ గడువులోగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి

Nirmal: నిర్మల్ గాజులపేట్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా. నిర్ణీత గడువులోగా పకడ్బందీగా ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశం.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 8 July 2026 2:58 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ గడువులోగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి

నిర్మల్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఫారముల డిజిటలీకరణ గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లు ఫారం పూర్తిచేసి ఇచ్చిన ఎస్ఐఆర్ ఫారముల డిజిటలికరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బిఎల్ఓ లు డిజిటలీకరణ ప్రక్రియను నిర్ణిత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. బిఎల్ఓ లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇంటికి వెళ్లి, నింపిన ఫారములను తిరిగి తీసుకోవాలని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. సూపర్వైజర్లు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు.

స్థానికంగా నివాసం ఉన్న ఓటర్ల ఇంటికి వెళ్లి, వారు ఎస్ఐఆర్ ఫారములు నింపుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ పై ఏవైనా సందేహాలు ఉంటే, హెల్ప్ డెస్క్ లో అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవీదాస్, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, తహసిల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story