Nirmal: భూముల రీ సర్వేతో అటవీ, రెవెన్యూ భూ సమస్యలకు పరిష్కారం కలెక్టర్!

Nirmal: నిర్మల్‌లో భూముల రీ సర్వే, అటవీ-రెవెన్యూ భూ సమస్యలపై కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్ష. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని అధికారులకు ఆదేశం.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 10 Oct 2026 10:56 AM IST
Nirmal
X

Nirmal: భూముల రీ సర్వేతో అటవీ, రెవెన్యూ భూ సమస్యలకు పరిష్కారం కలెక్టర్!

Nirmal: జిల్లాలో రెవెన్యూ, అటవీ భూ సమస్యల పరిష్కారానికి భూముల రీ సర్వే ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భూముల రీ సర్వే, అటవీ–రెవెన్యూ భూ సమస్యలు, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రీ సర్వే ప్రక్రియను సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. రీ సర్వే ద్వారా అటవీ, రెవెన్యూ, నీటిపారుదల తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన భూముల హద్దులను స్పష్టంగా గుర్తించి, భూ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, జిల్లా అటవీ శాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో దేవిదాస్, ఏడీ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విఠల్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL