Asifabad: భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ కె. హరిత!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ కె. హరిత ఆకస్మికంగా తనిఖీ చేసి భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
Asifabad: భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ కె. హరిత!
Asifabad: భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ కె. హరిత జిల్లాలో నెలకొన్న భూ సమస్యలను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు పట్టిక, రికార్డు గది, భూ భారతి ఫైళ్లను పరిశీలించారు. భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, రికార్డులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి అని అధికారులను ఆదేశించారు. ఈ కార్యాలయంలో సిబ్బంది ఎక్కువగా ఉన్నందున పరిశీలన, విచారణ, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ-సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి అని సర్వే రోజున రైతులు హాజరయ్యేలా ముందే నోటీసులు ఇవ్వాలి అని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ను 100 శాతం పూర్తి చేయాలని అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండాలని అన్నారు. మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలోని ఓటర్లకు 100 శాతం నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం ధృవపత్రాలు స్వీకరించాలి అని తెలిపారు.
ఈ నెల 15, 16 తేదీలలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో శిబిరాలు నిర్వహించి ఫారం-6 దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ హరిలాల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.




