Mancherial: ఓటర్ల సవరణ ప్రక్రియపై కలెక్టర్ కుమార్ దీపక్ కీలక సమీక్ష!
Mancherial: కలెక్టరేట్ లో కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో సమీక్ష జరిగింది.
Mancherial: ఓటర్ల సవరణ ప్రక్రియపై కలెక్టర్ కుమార్ దీపక్ కీలక సమీక్ష!
మంచిర్యాల జిల్లా: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ గడువులోగా పూర్తి చేయాలి – కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తైందని, మిగిలిన పనిని కూడా గడువుకంటే ముందే పూర్తి చేస్తామని తెలిపారు.
జిల్లాలో అనామోలీస్ అధికంగా ఉన్నాయని, డిజిటలైజేషన్ అనంతరం సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందులో సూచించిన ధ్రువపత్రాలను సమర్పిస్తే ఓటు హక్కు కొనసాగుతుందని వివరించారు.
డబుల్, మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల పేర్లను నిబంధనల ప్రకారం తొలగిస్తామని తెలిపారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లను గుర్తించి బీఎల్ఏల ద్వారా బీఎల్ఓలకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిజిటలైజేషన్ పూర్తయిన అనంతరం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతామని కలెక్టర్ వెల్లడించారు.




