Adilabad: పేద రోగికి అండగా నిలిచిన ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా!
Adilabad: తీవ్రమైన 'అక్యూట్ ప్యాంక్రియాటైటిస్' వ్యాధితో బాధపడుతున్న పేద బాధితుడికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా లక్ష రూపాయిల ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
Adilabad: పేద రోగికి అండగా నిలిచిన ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా!
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన నారాయణ - గంగమ్మ దంపతుల చిన్న కుమారుడు రాకేష్ గత కొన్ని రోజులుగా 'అక్యూట్ ప్యాంక్రియాటైటిస్' అనే తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వైద్య చికిత్స నిమిత్తం సదరు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం ఆవరణలో ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయ చెక్కును నేరుగా బాధితుడి చికిత్స కొరకు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో లభించిన ఈ ఆర్థిక సాయం తమ కుటుంబానికి ఎంతో భరోసానిచ్చిందనీ, సమయానికి స్పందించి మానవత్వంతో అండగా నిలిచిన కలెక్టర్ కు నిపాని గ్రామ ప్రజలు, బాధితుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
Next Story




