Adilabad: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట ఆదిలాబాద్ కలెక్టర్!

Adilabad: ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష. వనమహోత్సవంలో మొక్కలు నాటే కార్యక్రమం.

A. SRINIVAS, 	SHADANAGAR
Published on: 25 Aug 2026 1:54 PM IST
Adilabad
X

Adilabad: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట ఆదిలాబాద్ కలెక్టర్!

Adilabad: విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన నూతన అదనపు తరగతి గదులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలను నాటి నీరు పోశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా జిల్లా అకడమిక్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తరగతులకు క్రమం తప్పకుండా హాజరైతేనే సబ్జెక్టులపై పూర్తి పట్టు లభిస్తుందని, తద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుందని స్పష్టం చేశారు.

A. SRINIVAS, 	SHADANAGAR

A. SRINIVAS, SHADANAGAR