Gudihatnur: ధారమడుగులో మోదుగ ఆకుల విస్తరాకుల తయారీ కేంద్రం ప్రారంభం

Gudihatnur: గుడిహత్నూర్ మండలం ధారమడుగులో విస్తరాకుల తయారీ కేంద్రం ప్రారంభం. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపు.

NAGULA SATISH, BOATH
Published on: 24 Sept 2026 9:50 PM IST
Gudihatnur
X

Gudihatnur: ధారమడుగులో మోదుగ ఆకుల విస్తరాకుల తయారీ కేంద్రం ప్రారంభం

గుడిహత్నూర్: ​ధరమడుగులో విస్తరాకుల తయారీ కేంద్రం ప్రారంభం. ​గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలంగా దొరికే సహజ వనరులతో మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. గుడిహత్నూర్‌ మండలం ధారమడుగులో ఓఎస్‌ఎఫ్‌ (OSF) సహకారంతో ఏర్పాటు చేసిన 'మోదుగ ఆకుల విస్తరాకుల తయారీ కేంద్రాన్ని' గురువారం ఆయన ప్రారంభించారు.

కేంద్రంలోని యంత్రాలు, పనితీరును పరిశీలించి మహిళా సంఘాల సభ్యులతో కాసేపు ముచ్చటించారు. స్థానికంగా దొరికే మోదుగ ఆకులతో విస్తరాలు తయారు చేసి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. పర్యావరణహితమైన ఈ విస్తరాకులు వాడితే ప్లాస్టిక్‌ మహమ్మారిని తరిమికొట్టవచ్చని తెలిపారు.

​ప్రతి బొట్టునూ ఒడిసిపట్టాలి

అనంతరం ధారమడుగులోని నీటి కుంటను కలెక్టర్‌ పరిశీలించారు. వర్షపు నీటిని వృథా చేయకుండా ఒడిసిపట్టాలని, తద్వారా భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి మేలు జరుగుతుందని గ్రామస్థులకు వివరించారు. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ రవీందర్‌ రాథోడ్‌, ఈపీఆర్‌ శివరామ్‌, తహసీల్దార్‌ కవితారెడ్డి, సర్పంచ్‌ సీతాబాయి, మహిళలు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH