Adilabad: ఓటర్ల జాబితా పరిశీలన.. క్షేత్రస్థాయిలో కలెక్టర్ తనిఖీలు

Adilabad: హమాలివాడ పరిధిలో సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SSR) ప్రక్రియను మున్సిపల్ చైర్‌పర్సన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Rohith
Published on: 28 Jun 2026 2:39 PM IST
Adilabad
X

Adilabad: ఓటర్ల జాబితా పరిశీలన.. క్షేత్రస్థాయిలో కలెక్టర్ తనిఖీలు

ఆదిలాబాద్: ఆదిలాబాద్ లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ రాజర్షిషా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని హమాలివాడలో మున్సిపల్ చైర్ పర్సన్ అనూష తో కలిసి పర్యటించిన ఆయన, ఓటర్ల ఇళ్లను సందర్శించి నమోదు ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి అక్కడ నివసిస్తున్న ఓటర్ల వివరాలను పరిశీలించిన కలెక్టర్.. బీఎల్‌ఓలు నమోదు చేసిన సమాచారం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉందో లేదో ఓటర్లను అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా చూడడమే ఈ ప్రత్యేక పరిశీలన లక్ష్యమన్నారు.

అధికారులు, సిబ్బంది అత్యంత బాధ్యతతో వ్యవహరించి ప్రతి ఇంటి నంబరు, ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యలు కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.

ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

Rohith

Rohith

Next Story