Adilabad: బాల్య వివాహ రహిత తెలంగాణే ధ్యేయం.. జిల్లా కలెక్టర్ రాజర్షిషా

Adilabad: అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు ఘనంగా జరిగాయి.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 26 May 2026 5:47 PM IST
Adilabad
X

Adilabad: బాల్య వివాహ రహిత తెలంగాణే ధ్యేయం.. జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్: బాల్య వివాహ రహిత ఆదిలాబాదు జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక"లో భాగంగా మంగళవారం గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా వారోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన వివిధ టోల్ ఫ్రీ నంబర్ల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే జిల్లాలో బాల్య వివాహ రహితంగా నిలిచిన గ్రామ పంచాయతీలను అభినందిస్తూ వారికి ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, బాల్య వివాహ రహిత తెలంగాణ సాధనే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు.

చట్టప్రకారం వివాహానికి అమ్మాయిలకు కనీసం 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు అనేవి పిల్లలను చదువుకు దూరం చేయడమే కాకుండా, వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి బాలల బంగారు కలలను, వారి ఉజ్వల భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తాయని, అందుకే సమాజంలో బాల్య వివాహాలకు చెక్ పెట్టి ప్రతి ఒక్కరూ బాల్యాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు చేయడం చట్టరిత్యా పెద్ద నేరమని, ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

బాల్య వివాహం జరిపించినా, దానికి సహకరించి నిర్వహించినా, లేదా ఆ వివాహాన్ని ఏ రూపంలోనైనా ప్రోత్సహించినా సరే... చట్టప్రకారం వారికి 2 సంవత్సరాల కఠిన జైలు శిక్ష లేదా ఒక లక్ష.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story