Adilabad: పోలియో రహిత సమాజం నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత..కలెక్టర్!

Adilabad: హమాలివాడ అర్బన్ హెల్త్ సెంటర్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఘనంగా ప్రారంభించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 28 Jun 2026 1:07 PM IST
Adilabad
X

Adilabad: పోలియో రహిత సమాజం నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత..కలెక్టర్! 

ఆదిలాబాద్: పోలియో రహిత సమాజం నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హమాలివాడ అర్బన్ హెల్త్ సెంటర్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.

మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. పోలియో పై నిర్లక్ష్యంగా ఉంటె జీవితాంతం బాధపడాల్సి వస్తుందని అన్నారు. చిన్నారులకు పోలియో రాకుండా చుక్కల మందులను వేయించాలని సూచించారు.

టీకాల పంపినిని సద్వినియోగం చేసుకుని చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు.

గతంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసినప్పటికీ.. ప్రస్తుతం కూడా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. 2013 నుండి ఇప్పటివరకు పోలియో కేసులు లేవన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story