Adilabad: ఇచ్చోడ మార్కెట్ యార్డ్‌లో కలెక్టర్ రాజర్షిషా ఆకస్మిక తనిఖీలు

Adilabad: అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆకస్మికంగా సందర్శించారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 26 May 2026 5:37 PM IST
Adilabad
X

Adilabad: ఇచ్చోడ మార్కెట్ యార్డ్‌లో కలెక్టర్ రాజర్షిషా ఆకస్మిక తనిఖీలు

అదిలాబాద్: పంట కొనుగోళ్లతో పాటు గోదాంలకు తరలించే రవాణా ప్రకియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా మార్కెట్‌కు వస్తున్న పంట దిగుబడులు, ప్రస్తుత కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సేవలపై ఆయన అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యార్డ్‌లో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని స్వయంగా అడిగి తెలుసుకున్న కలెక్టర్, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మార్కెట్ యార్డ్‌కు పంటను తీసుకువచ్చే రైతులకు తాగునీరు, నీడ వంటి కనీస మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. పంట కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, తూకాల్లో ఎలాంటి వ్యత్యాసాలు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.

అలాగే, కొనుగోలు చేసిన పంటను సకాలంలో గిడ్డంగులకు తరలించేలా రవాణా చర్యలు వేగవంతం చేయాలని, రైతులకు చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story