Nirmal: నిర్మల్లో కాంగ్రెస్ నాయకుల నిరాహార దీక్ష సీఈసీ రాజీనామాకు డిమాండ్!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకుల నిరాహార దీక్ష. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఇన్చార్జ్ శ్రీహరి రావు.
Nirmal: నిర్మల్లో కాంగ్రెస్ నాయకుల నిరాహార దీక్ష సీఈసీ రాజీనామాకు డిమాండ్!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఎంపీల అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వానికి, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కులాల పేరుతో ప్రజలను విడగొడుతూ పరిపాలన కొనసాగిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ ఐ ఆర్ లో నియోజకవర్గంలో దాదాపు 70 వేల మందికి నోటీసులు వచ్చాయని, దీంతో వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆందోళనలో భాగంగా ఈనెల 10వ తేదీన నిర్మల్ జిల్లా కేంద్రంలో సుమారు 1000 మందితో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




