Adilabad: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి సీపీఐ!

Adilabad: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లాలో ఆగస్టు 4 నుంచి 14 వరకు పాదయాత్రలు చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Updated on: 14 July 2026 5:45 PM IST
Adilabad
X

Adilabad: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి సీపీఐ!

ఆదిలాబాద్: ప్రజా సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో,పాదయాత్రలు చేపడుతున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అథితిగా హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండట్టారు.

అనంతరం జిల్లాలో పార్టీ పరంగా ప్రజ సమస్యల పరిష్కరం కోసం ఆగస్టు 4 నుంచి 14 వరకు పాదయాత్ర వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నళిని రెడ్డి, అశోక్, కుంటాల రాములు, అమీన బేగం, మేస్రం భాస్కర్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story