Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ సమస్యలపై కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 30 Sept 2026 1:23 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ సమస్యలపై కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ అభివృద్ధికోసం వందకోట్లు కేటాయించాలనీ, అగ్నిప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబాలకు కేంద్రం 25 లక్షలు,రాష్ట్రం 25 లక్షలు చెల్లించాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని,ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని,ప్రమాద సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి, అడిషనల్ కలెక్టర్ చిత్రు కు వినతి పత్రం అందించారు.

ఈ సదర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ రిమ్స్ పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్షంగా ఉన్నాయి అన్నారు. రిమ్స్ అభివృద్ధి కోసం వందకోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే అగ్ని ప్రమాదం జరిగి ఐదు మంది చిన్నారులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల కుటుంబాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యాభై లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలన్నారు.

సంఘటనపై నిష్పక్ష పాతంగా సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాడ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రిమ్స్ ఆసుపత్రిలో దగ్గు మందు కూడా దొరకడం లేదు అని అన్నారు. పేదలు మందులు బయటకెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. 8 లిఫ్టులు వుంటే రెండు మాత్రమే పనిచేస్తున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొజ్జ ఆశన్న,జిల్లా కమిటీ సభ్యులు ఆర్.మంజుల,ఎన్,స్వామి, నాయకులు కొమరం భీంరావు,సాకారం, రామన్న,ఆశన్న,ఆరిఫా బేగం, రాధ, గంగాసాగర్, గంగారాం పాల్గొన్నారు..

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.