Utnoor: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇంట దండారి సందడి.. ఆదివాసీలతో కలిసి స్టెప్పులు!
Utnoor: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నివాసంలో దండారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దంపతులు ఆదివాసీలతో కలిసి నృత్యం చేశారు.
Utnoor: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇంట దండారి సందడి.. ఆదివాసీలతో కలిసి స్టెప్పులు!
Utnoor: ఎమ్మెల్యే బొజ్జు ఇంట దండారి సందడి.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రం లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇంట దండారి ఉత్చావాలా సందడి నెలకొంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ఇంటి ఆవరణలో మూడు ఆదివాసిగూడలకు సంబంధించిన ఆదివాసి కళాకారులు గుస్సాడీ ప్రదర్శన నిర్వహించారు.
తుడుం వాయిద్యాలు, రేలా రేలా పాటలు ఆదివాసుల సాంప్రదాయ నృత్యాలతో సందడి నెలకొంది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసులకు భోజన వసతి కనిపించారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అయన సతీమణి దృపద సైతం ఆదివాసీ ల తో కలిసి అడిపాడారు.
రేలారేలా పాటలు, తుడుం వా యిద్యాలు, దండారి కళాకారుల నృత్యల తొ పండుగ వాతావరణం నెలకొంది. రాబోవు రోజుల్లో ఆదివాసి కళాకారులందరినీ ఒకే చోట చేర్చి దండారి నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరు సంపాదిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.




