Asifabad: ముమ్మరంగా సాగిన ఫెర్టిలైజర్, సీడ్ డీలర్ల సదస్సు!

Asifabad: ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండల ఎల్కపల్లి రైతువేదికలో డీఏఓ వెంకట్ డీలర్లతో సమీక్షించి, అధిక ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

SRINIVAS, KOUTALA
Published on: 25 July 2026 11:05 PM IST
Asifabad
X

Asifabad: ముమ్మరంగా సాగిన ఫెర్టిలైజర్, సీడ్ డీలర్ల సదస్సు!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచిల్పేట్ మండలం లోని డీలర్స్ కి ఎల్కపల్లి రైతువేదికలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా డీలర్స్ ఎవరైనా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వo నిషేధించిన గడ్డి మందులు ఎవ్వరు కూడా విక్రయించరాదు అని అన్నారు. ఎలాంటి పురుగు మందులు ఎరువులు విక్రయిస్తే తప్పకుండా రైతులకి బిల్లు లు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. రైతు సోదరులు ఎవరైనా ఎరువుల దుకాణాలపైన ఫిర్యాదులు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని అన్నారు.

సీడ్ స్టాక్ నీ ఫామ్ D లో తప్పకుండా ఎంట్రీ చేయాలని అన్నారు. FERTLIZER యాప్ ద్వారా, ఈపాస్ మిషన్ ద్వారా మాత్రమే ఎరువులు అమ్మాలని అన్నారు. ప్రభుత్వం అనుమతించిన 7 రకాల వరి విత్తనాల్ని తీసుకున్న రైతుల వివరాలను పోర్టల్ లో అప్లోడ్ చేయాలని అన్నారు.

వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం లేదు కనుక వరి పంట సాగు తగ్గించాలని అన్నారు . డీలర్స్ అందరూ రైతు సోదరులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలని అన్నారు. నాసిరకం మందులు ఎవరైనా రైతులకి అంటకడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AO రామకృష్ణ, AEO లు వంశీ, శ్రీవిద్య, మండల డీలర్స్ పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story