Dasturabad: చింతమడుగు కుంట వివాదం కొలిక్కిరాని చర్చలు, సమావేశం వాయిదా

Dasturabad: దస్తురాబాద్, రాంపూర్ గ్రామాల మధ్య చింతమడుగు కుంట వివాదంపై అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం కొలిక్కి రాక వాయిదా పడింది.

RAKESH N, KHANAPUR
Published on: 12 Nov 2026 6:48 PM IST
Dasturabad
X

Dasturabad: చింతమడుగు కుంట వివాదం కొలిక్కిరాని చర్చలు, సమావేశం వాయిదా

దస్తురాబాద్: దస్తురాబాద్ మండల కేంద్రంలోని దస్తురాబాద్, రాంపూర్ గ్రామాల మధ్య ఉన్న చింతమడుగు కుంట వివాదంపై అదనపు కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరువర్గాల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో అధికారులు దీనిని వాయిదా వేశారు.

దస్తురాబాద్, రాంపూర్ గ్రామాల మధ్య ఉన్న చింతమడుగు కుంటపై హక్కుల విషయంలో గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మత్స్యకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. శాంతిభద్రతల దృష్ట్యా అధికారులు ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి, చేపల వేటకు వెళ్తే కఠిన చర్యలు తప్పవని ఆంక్షలు విధించారు.

ఆంక్షల కారణంగా తాము జీవనోపాధి కోల్పోయి నష్టపోతున్నామని ఇరువర్గాలు జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ ఏడీ (AD) కి వినతిపత్రాలు సమర్పించాయి.

వారి అభ్యర్థన మేరకు గురువారం రోజున దస్తురాబాద్ మండల కేంద్రంలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇరువర్గాల వాదనలు విన్నప్పటికీ, సమస్యపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు.

తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఇరువర్గాలు ఎలాంటి గొడవలకు పాల్పడకుండా ఉండేందుకు, చింతమడుగు చేపలు పట్టే ప్రాంతంలో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండు గ్రామ పంచాయతీల అధికారులు, సర్పంచులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR