Nirmal: దస్తురాబాద్‌లో ఘనంగా దేవీ నవరాత్రుల హోమ కార్యక్రమం!

Nirmal: దస్తురాబాద్‌లో దుర్గా దేవి నవరాత్రుల మండపం వద్ద సిద్ధి ధాత్రి ఉత్సవ సమితి, శివనాట్య మండలి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల నడుమ హోమం నిర్వహించారు.

RAKESH N, KHANAPUR
Published on: 18 Oct 2026 6:00 PM IST
Nirmal
X

Nirmal: దస్తురాబాద్‌లో ఘనంగా దేవీ నవరాత్రుల హోమ కార్యక్రమం!

Nirmal: దస్తురాబాద్ లోని సిద్ధి ధాత్రి ఉత్సవ సమితి, శివనాట్య మండలి దేవీ నవరాత్రుల వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇక్కడి శ్రీ దుర్గా దేవి నవరాత్రుల మండపం వద్ద అర్చకులు వేదమంత్రాల మధ్య ఘనంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు.

లోకకళ్యాణార్థం మరియు గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ పవిత్ర యజ్ఞంలో మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు తరలివచ్చారు.హోమ గుండం చుట్టూ కూర్చుని అమ్మవారి నామస్మరణతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో మురిసిపోయింది.

పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR