Nirmal: దస్తురాబాద్‌లో ‘ప్రజావాణి’కి అధికారుల ముఖం చాటు!

Nirmal: దస్తురాబాద్ మండల ప్రజావాణికి అధికారుల ముఖం చాటు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడ్డ బాధితులు. గైర్హాజరైన అధికారులపై చర్యలకు డిమాండ్.

RAKESH N, KHANAPUR
Published on: 17 Aug 2026 12:43 PM IST
Nirmal
X

Nirmal: దస్తురాబాద్‌లో ‘ప్రజావాణి’కి అధికారుల ముఖం చాటు!

Nirmal: దస్తురాబాద్ మండల కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి పలువురు అధికారులు ముఖం చాటేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతి సోమవారం 'ప్రజావాణి' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.

ఇందులో భాగంగానే దస్తురాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిన పలు శాఖల అధికారులు కనీస సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మరికొన్ని ముఖ్యమైన మండల స్థాయి శాఖల అధికారులు అసలు ఈ కార్యక్రమానికి హాజరే కాలేదు.

వివిధ సమస్యలపై సుదూర ప్రాంతాల నుండి అర్జీలు పట్టుకుని వచ్చిన సామాన్య ప్రజలు, కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR