Dasturabad: కోతి దాడి బాధితుడికి ఆసుపత్రిలో అందని వ్యాక్సిన్

Dasturabad: దస్తురాబాద్‌లో కోతి దాడికి గురైన బాలుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ దొరకకపోవడంతో బాధితుల ఆందోళన. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి.

RAKESH N, KHANAPUR
Published on: 16 Sept 2026 7:57 PM IST
Dasturabad
X

Dasturabad: కోతి దాడి బాధితుడికి ఆసుపత్రిలో అందని వ్యాక్సిన్

దస్తురాబాద్: దస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన బాలుడు బోరే నిశ్విత్ కు గత 5 రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటుండగా కోతులు దాడి చేయడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికెళ్ళి తొలి విడత వ్యాక్సిన్ వేయించారు.

మళ్లీ రెండు రోజుల తర్వాత వ్యాక్సిన్ కోసం వెళితే వ్యాక్సిన్ అందుబాటులో లేదని ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.

అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందుబాటులో లేకుంటే ఏదైనా అనుకోని ఘటన జరిగితే బాధ్యత ఎవరిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా చాలా సందర్భాల్లో వ్యాక్సినేషన్ అందుబాటులో లేక మారుమూల ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు మండల వాసులు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR