Adilabad: రాజీవ్ గాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన DCC అధ్యక్షుడు
Adilabad: దేశ ప్రధానిగా రాజీవ్‌గాంధీ అందించిన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ కొనియాడారు.
Adilabad: రాజీవ్ గాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన DCC అధ్యక్షుడు
ఆదిలాబాద్: ప్రధాన మంత్రిగా రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. దేశంలో టెక్నాలజీతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని... 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని అన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయ సాధనకై ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కుసుమ్ ఆలం, మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు ఉన్నారు.
Next Story




