Nandigundam: శ్రీగిరి నందిగుండంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Nandigundam: శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ముస్తాబు పూర్తయింది. రేపటి నుంచి మాలధారణలు, నిత్య అన్నదానం ప్రారంభం కానున్నాయి.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 10 Oct 2026 5:18 PM IST
Nandigundam
X

Nandigundam: శ్రీగిరి నందిగుండంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Nandigundam: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో శనివారం ఆలయంలో ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కొండాది వెంకట చారి మాట్లాడుతూ రేపు అనగా అక్టోబర్ 11వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభం అవుతాయని అన్నారు.

మాల ధారణ చేసుకునే స్వాములు ఉదయం ఐదు గంటల నుంచి మాల ధారణ ఉంటుందని తెలిపారు అలాగే ప్రతి రోజు నిత్య అన్నదానం ఉంటుందని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు.

ముఖ్యంగా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి పుష్పార్చన రథోత్సవం అక్షరాభ్యాసం ఈసారి నూతనంగా కుస్తీ పోటీలు ఇలా మరెన్నో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL