Gudihatnur: లవ్ జిహాద్‌ను అంతం చేయడానికే ధర్మ శిక్షణ..డాక్టర్ విజయ భాస్కర్!

Gudihatnur: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్‌లో నిర్వహించిన వంజరి సంఘం మేళాలో లవ్ జిహాద్ అంతానికి ధర్మ శిక్షణ అవసరమని డాక్టర్ విజయ భాస్కర్ పిలుపునిచ్చారు.

NAGULA SATISH, BOATH
Published on: 19 Oct 2026 6:16 AM IST
Gudihatnur
X

Gudihatnur: లవ్ జిహాద్‌ను అంతం చేయడానికే ధర్మ శిక్షణ..డాక్టర్ విజయ భాస్కర్!

Gudihatnur: ​సమాజంలో లవ్ జిహాద్‌ను అంతం చేయడం కేవలం ధర్మ శిక్షణ, శౌర్య శిక్షణల ద్వారానే సాధ్యమని డాక్టర్ విజయ భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామంలోని ఎస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన వంజరి సంఘం మేళాలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. లవ్ జిహాద్ రూపంలో హిందూ సమాజం, సంస్కృతిపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు మహిళలు, యువతలో ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణపతి, దుర్గామాత వంటి ఉత్సవాలు కేవలం ఆడంబరాల కోసం నిర్వహించే వేడుకలు కావని, అవి హిందూ యువతలో ఐక్యత, చైతన్యాన్ని రగిలించే ధర్మ సమ్మేళనాలుగా మారాలని సూచించారు. దేవి మండపాలను కేవలం పూజలకు మాత్రమే పరిమితం చేయకుండా, ధర్మ శిక్షణ, ఆత్మరక్షణకు సంబంధించిన శౌర్య శిక్షణ అందించే శక్తి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ వారానికి కనీసం రెండు గంటల సమయాన్ని హిందూ ధర్మ రక్షణకు, సంస్థల కార్యక్రమాలకు కేటాయించాలని కోరారు. లవ్ జిహాద్ వల్ల సమాజంలో కుటుంబ వ్యవస్థలు, సంస్కృతి దెబ్బతింటున్నాయని, మహిళలు విదేశీ పోకడలకు బదులు భారతీయ సంప్రదాయాలను, వస్త్రధారణను కాపాడుకోవాలని గుర్తుచేశారు.

​లవ్ జిహాద్ బారిన పడకుండా మహిళలు అప్రమత్తంగా ఉండాలని, వివాహ భాగస్వామి ఎంపికలో స్వధర్మాన్ని కాపాడే వారినే ఎంచుకోవాలని, అలాగే ఇతర మతాల వలలో చిక్కుకున్న వారిని జాగృతం చేసి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజును తీర్చిదిద్దిన జిజియామాత స్ఫూర్తితో మహిళలు తమ సంతానానికి ధర్మ సంస్కారాలు నేర్పించి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వంజరి సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH