Bhainsa: భైంసాలో తీవ్ర డీజిల్ కొరత.. బంకుల ఎదుట వాహనాలు, రైతుల బారులు!
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, రైతులు. బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు, ఒకే బంక్ వద్ద బారులు తీరిన వాహనాలు.
Bhainsa: భైంసాలో తీవ్ర డీజిల్ కొరత.. బంకుల ఎదుట వాహనాలు, రైతుల బారులు!
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో డీజిల్ కొరతతో వాహనదారులు, వ్యవసాయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ నో స్టాక్ అంటూ బోర్డులు దర్శనమిస్తుండగా.. మరో బంక్ లో ఆన్ లైన్ ప్రాబ్లమ్ అంటూ వినియోగదారులను వెనక్కి పంపుతున్నారు.
దీంతో డీజిల్ కోసం వాహనదారులు, రైతులు బంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులకు, వాహనాలకు డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే భైంసాలోని ఓ బంక్ లో డీజిల్ అందుబాటులో ఉండటంతో భారీగా వాహనాలు బారులు తీరాయి. డీజిల్ కొరతకు కారణమేంటి, సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందోనని వాహనదారులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




